జంగుబాయి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సీతక్క

ఆదిలాబాద్​: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే కేస్లాపూర్ నాగోబా జాతరకు రూ. 20 లక్షలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం గొండి గ్రామ పరిధిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గుహ లోపలకు వెళ్లి  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జంగు బాయి పుణ్యక్షేత్రం  అభివృద్ధి కృషి చేస్తామన్నారు.