తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సోమవారం పంచాయితీరాజ్. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క ) పర్యటించారు. మండల కేంద్రంలో రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ప్రారంభించారు. కాటా పూర్, బీరెల్లి, వీరాపూర్ రంగాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు.
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మంత్రి వెంట పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి, మాజీ సర్పంచ్ ముజాఫర్ ఖాన్ పాల్గొన్నారు.