
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల ఇళ్లు ఇవ్వలేదని, పేదలు 2 లక్షల ఇళ్లు కోల్పోయారని మంత్రి సీతిక్క విమర్శించారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు సీతక్క. గత ఐదేండ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, పేపర్లు లీక్ చేసి నోటిఫికేషన్ రద్దు చేయడం బీఆర్ఎస్ పని అయ్యిందని విమర్శించారు.
తాము ఉద్యోగాలు ఇస్తుంటే కడుపులో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే సామాజిక న్యాయమని, అందుకోసమే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేయడానికి పూనుకున్నట్లు తెలిపారు. సీఎం చెప్పేదే చేస్తారు.. చేసేదే చెప్తారని అన్నారు. కేవలం 15 నెలల్లో 57 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఈ సంద్భంగా మంత్రి సీతక్క అన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని విమర్శించారు.
Also Read:-దుండగులను పట్టించిన పట్టించిన ఫోన్ పే..