ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రాష్ర్ట రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోమని డీసీసీబీ చైర్మన్కూరాకుల నాగభూషయ్య అన్నారు. ఆయన ద్వారానే జిల్లా సమగ్రాభివృద్ధి సాధించిందన్నారు. బుధవారం నగరంలోని మంత్రి క్యాంపు ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన కోరం కనకయ్యను సీఎం కేసీఆర్జడ్పీ చైర్మన్‌గా చేస్తే ఇప్పుడు పొంగులేటి పంచన చేరి ఇష్టారీతిన నడిస్తే సహించేది లేదన్నారు.
పువ్వాడ అజయ్‌కు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఎక్కువ అని, వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఎవరు ఎలా రియాక్ట్అవుతారో తెలియదన్నారు. అభివృద్ధిపై చర్చకు వస్తానంటే దేనికైనా సిద్ధమన్నారు. మమత ఆసుపత్రి పేదలకు నిత్యం వైద్యం అందించే దేవాలయమన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారమే మమత ఆసుపత్రిలో కొంత స్థలం రెగ్యులరైజ్చేయించుకుంటే దానికి లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ ఉన్నారు.