ఎల్బీనగర్, వెలుగు: త్వరలో బ్రాహ్మణ పరిషత్నిధుల విడుదలకు కృషి చేస్తానని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబును తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ సోమవారం కలిసి బ్రాహ్మణ పరిషత్ నిధుల విడుదలపై వినతిపత్రం అందజేశారు.
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. నిధులు ఆలస్యం కాకుండా త్వరలోనే విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మోత్కూరు రామేశ్వర్ రావు, నమిలికొండ కిరణ్, సంఘం సభ్యులు
పాల్గొన్నారు.