పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డుతో పాటు ఎక్లాస్ పూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు శ్రీధర్ బాబు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేయాలని..రైతులు పండించిన పంటను తరుగు లేకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని.. కొనుగోలు కేంద్రాల సిబ్బందిని, అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు.
ALSO READ : కాళేశ్వరం ఫైళ్లను అందించిన రిటైర్డ్ ఈఎన్సీ నల్లా... కమిషన్ చేతికి కీలక ఆధారాలు
రాష్ట్రంలో రైతులకు 18 వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల రుణమాఫీ చేశామని.. రుణమాఫీ కానీ వారికి టెక్నికల్ సమస్యలు తొలగించి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలుతో పాటు సన్న రకం వరి ధాన్యం పండించిన రైతులందరికీ క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.