పదేళ్లు ఆగిన అభివృద్ధిని పునః ప్రారంభించాం: మంత్రి శ్రీధర్ బాబు

పదేళ్లు ఆగిన అభివృద్ధిని పునః ప్రారంభించాం: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలో అడవి సోమన్ పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాలకు శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీ కృష్ణ. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత గురుకుల పాఠశాల భవనాలకు శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు నాణ్యమైన విద్య అందించటమే ప్రభుత్వ లక్ష్యమని... రూ.250 నుండి రూ .300 కోట్లు ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు.

రాష్ట్రంలో మార్పు తీసుకొస్తున్నామని.. రైతులకు రుణమాఫీ చేసి చూపించమని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని అన్నారు. డీఎస్సీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. పదేళ్ళపాటు ఆగిన అభివృద్ధిని పునః ప్రారంభించామని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు.