సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ వేస్తామన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన కారణంగా సింగరేణి ఎన్నికలు మూడు నెలలు వాయిదా వేయాలని ప్రభుత్వం విజ్ఇప్తిని రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది.
ఈనెల 27న ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు డిసెంబర్ 25వ తేదీ సోమవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ -3 పరిధిలోని ఎల్పీపీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఐఎన్టీయూసీ నిర్వహించిన గేట్ మీటింగ్ కు మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడుతూ.. ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను కోరారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని తెలిపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామని చప్పారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విదంగా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.