31,500 కోట్ల పెట్టుబడులు..30, 750 ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

31,500 కోట్ల పెట్టుబడులు..30, 750 ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా ,సౌత్ కొరియా పర్యటనలో అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపామన్నారు  మంత్రి శ్రీధర్ బాబు.  19 సంస్థలతో 31 వేల 500 కోట్ల ఓప్పందం చేసుకున్నామని తెలిపారు. దీని ద్వారా 30,750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. 

అమెరికా సౌత్ కొరియా పర్యటనలో  కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నామన్నారు శ్రీధర్ బాబు.  పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లామని చెప్పారు.  పర్యటన హిట్టయిందా?ప్లాప్ అయ్యిందా అన్న ప్రశ్న కాదు పెట్టుబడులు రావాలి..యువతకు ఉద్యోగాలు రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. సౌత్ కొరియా లాంటి దేశంలో పర్యటించడం తొలిసారని చెప్పారు.  అంతర్జాతీయ కంపెనీలతో  సీఎం చర్చలు జరిపారన్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని కంపెనీ ప్రతినిధులను కోరామని చెప్పారు.
 
సెమీ కండక్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీలత చర్చలు జరిపామన్నారు శ్రీధర్ బాబు. వరల్డ్ బ్యాంక్ ఛైర్మన్, అడాబ్ సీఈవోతో చర్చలు జరిపామన్నారు.  మొదటి సారి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా వెళ్లామన్నారు.  గత పదేళ్లలో ముఖ్యమంత్రి స్థాయిలో  అమెరికా  వెళ్లలేదన్నారు.  హైదరాబాద్ 4.0 విజన్ ను పారిశ్రామిక వేత్తలకు వివరించామని చెప్పారు. 

ఐటీ రంగంలో గ్లోబల్ కెపబుల్ సెంటర్స్  ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు శ్రీధర్ బాబు.   రాష్ట్రంలో బయోడిజైర్ సిటీ ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీని కోరామన్నారు. అమెజాన్ సంస్థ త్వరలో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. మోనార్క్ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ల కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందన్నారు శ్రీధర్ బాబు. బయో ఇథనాల్ తయారీ కంపెనీలతో ఒప్పందం జరిగిందన్నారు.