కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు

కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు
  • జేపీ నడ్డా అవగాహన లేకుండా అబద్ధాలు మాట్లాడిండు
  • వైట్​ పేపర్ లాంటి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపు
  • మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపణ
  • ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియగానే స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నీ అమలైతయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

పెద్దపల్లి/సుల్తానాబాద్/గోదావరిఖని, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలోనే పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ ప్రాంతంపై, కాకా కుటుంబం చేసిన సేవలపై ఎలాంటి అవగాహన లేని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధాలు మాట్లాడి పోయిండని మండిపడ్డారు. ‘‘జేపీ నడ్డా పెద్దపల్లి గడ్డపై నిలబడి కాకా కుటుంబం ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కానీ కాకా వెంకటస్వామి ఖాయిలాపడ్డ సింగరేణి సంస్థను కాపాడారు.

 కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించారు. అధికారంలో ఉన్నా లేకున్నా కాకా కుటుంబం, కాకా ఫౌండేషన్, విశాక ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టింది. గత పదేండ్లుగా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు. రాష్ట్రంలో కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తే, కేంద్రంలో మోదీ అదానీ, అంబానీల కోసం పని చేస్తున్నాడు’’అని ఫైర్ అయ్యారు.

 కాంగ్రెస్​ హయంలోనే ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందని, ఆ విషయం నడ్డాకు తెలియకపోవచ్చు గానీ, ఈ ప్రాంత ప్రజలకు తెలుసన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, గోదావరిఖని కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగుల్లో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్​సింగ్​రాజ్​ఠాకూర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.​ 

గెలిచినా ఓడినా ప్రజాసేవలో ఉన్నాం: వివేక్ వెంకటస్వామి

తన తండ్రి కాకా వెంకటస్వామిని ఇక్కడి నుంచి నాలుగు సార్లు, తనను ఒకసారి ఎంపీగా గెలిపించారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. అందువల్లే తనకు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కోసం పోరాడే చాన్స్ దొరికిందని చెప్పారు. కాకా మాదిరిగానే తాను ప్రజాసేవలో ఉన్నానని, గెలిచినా, ఓడినా తమ ట్రస్టుల ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500కు గ్యాస్​, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. 

కానీ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ పదేండ్లలో కనీసం డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇండ్లు సహా అన్ని స్కీములు అమలు చేస్తామని ఆయన చెప్పారు. మహిళలకు రూ.2,500 తోపాటు కేంద్రంలో అధికారంలోకి వస్తే రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఉపాధి హామీల కూలిని రూ.200 నుంచి రూ.400కు పెంచుతామని, ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. తాము నిజాయితీగా వ్యాపారాలు చేస్తామని, రూ.10 వేల కోట్లు ప్రభుత్వానికి పన్నులు కట్టామని, కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు తనపై కావాలనే ఈడీ దాడులు చేయించారన్నారు. అయితే, ఈడీ అధికారులు తనపై ఎలాంటి అవినీతిని నిరూపించలేక పోయారన్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు.

ఆఫీసులు తరలిపోతుంటే దాసరి మనోహర్​ ఏం చేశారు? విజయరమణారావు 

పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఇక్కడ నుంచి ఆఫీసులు తరలిపోతుంటే ఆయన ఆపలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏర్పాటు చేసిన ఆఫీసులన్నీ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో వేరే ప్రాంతాలకు తరలిపోయాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్లు తీసుకొని అక్రమ తరలింపునకు సహకరించారని ఆరోపించారు. ఇక్కడి నుంచి ఏయే ఆఫీసులు తరలిపోయావో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో తిరిగి తీసుకొస్తానని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ రైతులను నిలువునా ముంచిందని మండిపడ్డారు. 

ప్రజల సొమ్మును పంచిపెడుతుండు

గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. మోదీ మాత్రం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పేరుతో వసూలు చేసిన సొమ్మంతా అదానీ, అంబానీలకు దోచిపెడ్తున్నారని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశముందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కులగణన చేసి, వారి సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు, స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన పాంచ్ న్యాయ్ అమలు చేస్తామని వెల్లడించారు. వైట్ పేపర్ లాంటి నాయకుడు వంశీకృష్ణ అని, ఆయనను భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. 

పెద్దపల్లికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏం చేసిండు: గడ్డం వంశీకృష్ణ 

పదేండ్లు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీకి పది ఎంపీ సీట్ల కంటే ఎక్కువ ఉండేవని, కానీ పెద్దపల్లికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏం చేశారని ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. కాకా వెంకటస్వామి హయాంలోనే ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టుకు ప్రపోజల్ తీసుకొచ్చారని, అయితే, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రపోజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.లక్ష కోట్లను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 

వివేక్ వెంకటస్వామి లాంటి వారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నిరుద్యోగం ఉందని, దానిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.  రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పార్లమెంటులో మీ గొంతునవుతానని చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో పదేండ్లు ఎన్నో కష్టాలు పడ్డామని, వాటన్నింటిని ఓర్చుకొని కాంగ్రెస్ జెండాను వదలని పార్టీ కార్యకర్తలకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థివంశీకృష్ణ కృతజ్ఞతలు చెప్పారు.