ఫార్ములా ఈ రేసును తప్పుబట్టలే..పేమెంట్స్ జరిగిన తీరు సరిగా లేదన్నాం : మంత్రి శ్రీధర్ బాబు 

ఫార్ములా ఈ రేసును తప్పుబట్టలే..పేమెంట్స్ జరిగిన తీరు సరిగా లేదన్నాం : మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్ రేస్‌‌ను తాము ఎప్పుడూ తప్పుబట్టలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పేమెంట్స్ జరిగిన విధానమే సరిగా లేదని చెప్పామన్నారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతుందని, అది అంతర్జాతీయ ప్రోగ్రామని చెప్పారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే జగదీశ్‌‌ రెడ్డి మాట్లాడిన తీరు కంటే.. ఆయన హావభావాలు సరిగా లేవన్నారు. ఆయన మాటలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. ఈ సెషన్స్ చివరి నాటికి ఎథిక్స్ కమిటీ తప్పకుండా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.