- ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే వెచ్చించాం
- మూసీ రివర్‌ఫ్రంట్‌పై ప్రపంచ బ్యాంకుతో చర్చించినం
- ఫ్యూచర్స్టేట్గా తెలంగాణ ఉండబోతున్నదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాము చేపట్టిన విదేశీ టూర్ సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది ప్రజలకు తెలుసునని ఐటీ, ఇండస్ట్రీస్మినిస్టర్ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎవరు ఫ్లాప్ అయ్యారో అనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందని బీఆర్ఎస్నేతలకు చురకలంటించారు. విదేశీ పర్యటనను ముగించుకొని బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రీధర్ బాబు.. అక్కడే మీడియాతో మాట్లాడారు. ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఒకసారి అగ్రిమెంట్అయ్యాక మళ్లీ ఎవరైనా చేసుకుంటారా? అని ప్రశ్నించారు.
బహుశా వాళ్లు ఒక్కసారి ఫొటో దిగిపోగానే అగ్రిమెంట్అయిపోయిందని అనుకుంటున్నారేమోనని బీఆర్ఎస్లీడర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆనాడు నమ్మకం లేకనే ఇన్వెస్ట్మెంట్లకు అగ్రిమెంట్లు చేసుకోలేదన్నారు. ఇప్పుడు తమ విధివిధానాలను చూసి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. 7 నెలల కాకముందే ఇట్ల చేస్తున్నారంటే రాబోయే కాలంలో ఎంత ఆందోళన చెందుతారోనని అన్నారు. మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రపంచ బ్యాంకుతో చర్చించినట్టు తెలిపారు.
మూసీ రివర్ ఫ్రంట్ఆర్థిక ఇంజిన్‌గా ఉండనున్నదని చెప్పారు. మూసీ రివర్‌ఫ్రంట్‌పై ప్రపంచ బ్యాంకుకు రిపోర్టులు అందించి, వారి సహకారం తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ ఉండబోతున్నదని చెప్పారు. ‘తెలంగాణ ఆలోచనా విధానాన్ని విదేశీ ప్రతినిధులకు చెప్పాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఉద్దేశ్యాన్ని విదేశీ కంపెనీలు అభినందించాయి. విదేశీ పర్యటనలో ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే వెచ్చించాం.” అని శ్రీధర్‌బాబు తెలిపారు.