ప్రజాసేవ చేయడానికే వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చిండు : శ్రీధర్ బాబు

ప్రజాసేవ చేయడానికే వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చిండు : శ్రీధర్ బాబు

అధికారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే  లక్ష్యంతోనే గడ్డం వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చాడన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అధికారం చిన్నప్పటినుంచే వంశీ చూశారన్నారు. మంచి యువకుడిని అధిష్టానం పెద్దపల్లిలో  ఎంపిక చేసిందన్నారు.   తండ్రిపై ఆధారపడకుండా సొంత కంపెనీలతో ఎదిగాడన్నారు. వేలాదిమందికి ఉపాధి దొరకాలంటే పెద్దపల్లిలో వంశీ గెలవాలని చెప్పారు. 

 మే13న పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని వంశీని  గెలిపించాలని కోరారు మంత్రి  శ్రీధర్ బాబు. .  వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి  మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.  పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు.  

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 5  హామీలను అమలు చేశామన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి. తాను తెలంగాణ కోసం పోరాడనని..  ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తుచేశారు.  సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వంశీ కృష్ణను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.  కేసీఆర్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు .. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బుద్ది చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు.  పదేళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని వివేక్ ఆరోపించారు.