దివంగత నేత కాక వెంకటస్వామి రాజకీయ దురంధరుడు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అని చెప్పారు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారని తెలిపారు. మందమర్రి మండలం క్యాతన్ పల్లి ఎంఎన్ఆర్ గార్డెన్ లో జరిగిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన పాల్గొన్నారు.
NH63లో ఉన్న ఇబ్బందులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి రూ.100 కోట్ల నిధులను తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే వివేక్ కు దక్కుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాకా కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చిందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. హైదారాబాద్,డిల్లీకి పోయిన మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడే వ్యక్తి ఎమ్మెల్యే వివేక్ అని చెప్పుకొచ్చారు. మంచి నాయకులుగా గుర్తు ఉన్న కాక,వివేక్,వంశీ మీ వెంట ఉండడం అదృష్టమని తెలిపారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం.. ప్రాంతంలో ఫ్యాక్టరీలను తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దమ్ము ధైర్యం ఉన్న లీడర్ వంశీ అని కొనియాడారు మంత్రి శ్రీధర్ బాబు. భవిష్యత్తులో ఎంపీ వంశీకృష్ణ పెద్ద లీడర్ కావాలని కోరుకుంటున్నానని..మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. చెన్నూరు రైతులకు ప్రణాళిక బద్దంగా సాగు నీరు అందించేందుకు వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని శ్రీధర్ బాబు తెలిపారు. మారుమూల ప్రాంతాలైన చెన్నూరు మంథని ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పారు.