కరీంనగర్ టౌన్, వెలుగు : హయ్యర్ ఎడ్యుకేషన్‌లో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణ రాసిన పుస్తకాన్ని మంత్రి శ్రీధర్‌బాబుకు అందజేశారు. గురువారం కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్య రంగంలో ఆవిష్కరణలు
పరిశోధనలు, జాతీయ విద్యావిధానంపై వ్యాసాలు రాయడాన్ని ప్రిన్సిపాల్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎన్ఎన్ఎస్ కోఆర్డినేటర్ రాజు, లెక్చరర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.