ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటనలో ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. సీఎం భద్రాతా ఏర్పాట్లలో ఓ ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ ను ముందుకు పంపుతున్నారు. ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ హడావుడిగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వెనుక పరుగెత్తారు. ఆయన వెనుకనే వస్తు్న్న మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ డ్రైవర్ ఏఎస్పీని గమనించకపోవడంతో ఆయన్ను కాన్వాయ్ ఢీకొట్టింది.
దీంతో ASP పంకజ్ ఒక్కసారిగా కిందపడ్డారు. స్వల్ప గాయాలు అయ్యాయి. హాస్పిటల్ లో చేరిని ఏఎస్పీని ఐజీ రంగనాథ్, ఎస్పీ రోహిత్ రాజ్ పరామర్శించారు. ప్రస్తుతం ఏ.ఎస్.పి పారితోష్ పంకజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.