పింఛన్ల పెంపులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలన్న మాజీ మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు మంత్రి శ్రీధర్ బాబు. హరీశ్ రావు చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థమవుతుందని విమర్శించారు. తాము తెలంగాణ ప్రజలు ఆలోచనలను అమలు చేస్తాం కానీ.. ఏపీ ఆలోచనలు కాదన్నారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని అన్నారు.
12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను తామే నిర్వహించామని చెప్పారు శ్రీధర్ బాబు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ కు లేదన్నారు. వాళ్ల హయాంలో ఆశా వర్కర్స్ ను గుర్రాల తో తొక్కించారని విమర్శించారు. త్వరలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.
పెద్దపల్లిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతుందన్నారు శ్రీధర్ బాబు. ఘటన జరగడం దురదృష్టకరమని.. శాంతి భద్రత విషయంలో తమ ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. మెదక్ లో జరిగిన మతఘర్షణల విషయంలో సీరియస్ గా ఉన్నాం.. ఘటన వెనక ఎవరి హస్తం ఉన్నా ఉక్కు పాదంతో అణిచివేస్తామని చెప్పారు.