రైతుల విషయంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంతో మంథనికి ఒక్క నీరు ఇవ్వలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎంపీ సీట్ల కోసం అనవసరంగా రాజకీయాలు వద్దన్నారు. కేసీఆర్ సూచనలు ఇవ్వాలి కానీ రైతుల విషయంలో రాజకీయాలు చేయోద్దని హితవు పలికారు.
రైతుల విషయం లో కేసిఆర్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లక్ష రూపాయల రుణమాఫీ సగం మంది రైతులకు చేయలేదన్నారు. గత సంవత్సరం వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పది సంవత్సరాలలో రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇబ్బందులకు కారణం కేసీఆరేనని అన్నారు. కాళేశ్వరం రిడిజైన్ సరికాదని మొదటి నుంచి చెప్పామని.. రైతుల భూములు ఇండ్లు తీసుకున్నారు తప్ప నీరు అందించలేదన్నారు.