![యూజీసీ కొత్త రూల్స్ విరమించుకోవాలి : శ్రీధర్ బాబు](https://static.v6velugu.com/uploads/2025/02/minister-sridhar-babu-demands-government-to-scrap-ugc-new-rules_iuMfIyFrOD.jpg)
- బెంగళూరులో ఆరు రాష్ట్రాల ప్రతినిధుల భేటీ
- తెలంగాణ నుంచి అటెండ్ అయిన శ్రీధర్ బాబు
హైదరాబాద్,వెలుగు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించిన కొత్త నిబంధనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. బెంగళూరులో కర్నాటక హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వార్యంలో స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్ట ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమయ్యారు. దీనిలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు తెలంగాణ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు హాజరయ్యారు.
యూజీసీ రూపొందించిన ప్రొఫెసర్లు, వీసీల నియామకపు ప్రక్రియను వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వాలకే వైస్ ఛాన్స్ లర్ల నియామకంలో పూర్తి అధికారులు కల్పించాలని డిమాండ్ చేశారు. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ విధానం తొలగింపును పునర్ సమీక్షించాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అనుగుణంగా ఉన్న ప్రతిపాదనలను సరిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి, యూజీసీ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.