
మల్లాపూర్ , వెలుగు : నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్‌పై స్పష్టత వచ్చేవరకు గడ్డం తీయననీ,చెప్పులు వేసుకోనని చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి 8నెలల కింద చేపట్టిన దీక్షను మంత్రి శ్రీధర్‌బాబు చెరుకురసం ఇచ్చి విరమింపజేశారు. బుధవారం రీఓపెన్ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు బుధవారం ఫ్యాక్టరీని సందర్శించి స్పష్టమైన హామీ రావడంతో నారాయణరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ దీక్ష విరమించారు. కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, లీడర్లు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం, సుజిత్ రావు, వాకిటి సత్యం రెడ్డి పాల్గొన్నారు.