గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం : శ్రీధర్ బాబు 

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 

మంథని టౌన్ , వెలుగు :  మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  హామీ ఇచ్చారు. క్రిస్మస్​ పండుగ సందర్భంగా సోమవారం మంథని పట్టణంలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

కేట్​ కట్​చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రజల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్, లీడర్లు కొత్త శ్రీనివాస్, పెండ్రు రమ, ఇనుముల సతీశ్‌‌, పాస్టర్లు  పాల్గొన్నారు.