-
ఆర్‌బీఐ రూల్స్‌కు లోబడే లోన్లు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మూలధన సేకరణలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూపొందించిన సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ విధానాన్ని వినియోగించుకోనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
నిధుల సమీకరణకు సెబీ, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడి బడా పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచి పెట్టుబడులు ఆహ్వా నించే ప్రణాళికపై గురువారం సెక్ర టేరియెట్‌లో మంత్రి రివ్యూ చేపట్టారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి ఫండ్ సేకరణ జరపడానికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ అత్యవసరమని శ్రీధర్ బాబు అన్నారు.