రైతు రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ కడుపుమంట:మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేస్తుంటే బీఆర్ ఎస్ నేతలకు కడుపు మంటతో పసలేని ఆరోపణనలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎల్లుండి ( జూ లై 25) నుంచి తెలంగాణ బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్రం బడ్జెట్ పెట్టిన తర్వాత రాష్ట్రాల బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను బట్టి తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. సభలో అన్ని అంశాలపై చర్చిస్తాం.. 3 రోజుల్లో బడ్జెట్ పూర్తిస్థాయి చర్చ ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.