కుటుంబ సర్వే పూర్తయిన వెంటనే..స్థానిక సంస్థల ఎన్నికలు:మంత్రి శ్రీధర్బాబు

కుటుంబ సర్వే పూర్తయిన వెంటనే..స్థానిక సంస్థల ఎన్నికలు:మంత్రి శ్రీధర్బాబు

శంషాబాద్, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిన వెంటనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సర్వేకు సంబంధించి శంషాబాద్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేదని మంత్రి సమక్షంలో ఎస్సీ సెల్ నాయకుడు జలపల్లి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శ్రీధర్​బాబు స్పందిస్తూ.. పార్టీలో పనిచేసిన వారికి కచ్చితంగా సముచిత స్థానం లభిస్తుందని, ఇప్పటికే చాలామందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్లు తెలిపారు. 

ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మల్​రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.