పదేండ్లలో చేయలేని పనులు.. ఏడాదిలో చేస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

పదేండ్లలో చేయలేని పనులు.. ఏడాదిలో చేస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

గత పదేండ్లలో చేయలేని పనులు.. ఒక్క ఏడాదిలో చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో యువజన వికాస సభలో పాల్గొన్న ఆయన.. పెద్దపల్లి నియోజవర్గంలో రూ. 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

కాంగ్రెస్ ప్రజాపాలనలో పెద్దపల్లినియోజకవర్గంలో బుధవారం ( డిసెంబర్ 4) వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు శంకు స్తాపన చేశారు. రూ. 585 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేశారు. పెద్దపల్లికి బస్ డిపో , పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు మంజూరు చేశారు.  

రూ.6కోట్ల 45 లక్షలతో పెద్దపల్లిలో కొత్త మున్సిపల్ కార్యాలయం భవనం ఏర్పాటుచేస్తున్నట్లు  మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రూ. 101కోట్లతో గుంజగడపలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం, రూ. 23కోట్లతో సింగరేణి ద్వారా రామగుండంలో అభివృద్ది పనులు చేపట్టామన్నారు.

మంథనిలో 50 పడకల ఆస్పత్రి, పెద్దపల్లిలో 100 పడకల ఆస్పత్రి, రూ. 7కోట్లతో రామగిరి ఖిల్లా, మంథని టెంపుల్ సర్క్యూట్ అభివృద్ది చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పెద్దపల్లి బైపాస్ కోసం రూ. 82కోట్లు మంజూరు, రూ. 62 కోట్లతో ఆర్ అండ్ బీ పనులకు శంకుస్థాపన చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ కోసం అనునిత్యం  కష్టపడుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి ఖనిలో అకడమిక్ బ్లాక్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ 5కోట్ల 25లక్షలతో మహిళా కళాశాల ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెద్దపల్లి బస్ డిపో  కలను సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 

మరిన్ని వార్తలు