తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు.. బడ్జెట్​ కేటాయింపుల విషయంలో పునరాలోచించండి

తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు.. బడ్జెట్​ కేటాయింపుల విషయంలో పునరాలోచించండి

తెలంగాణకు నిధులు కేటాయించే విషయంలో అన్యాయం చేసిందని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు.  సీఎం రేవంత్​ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేకసార్లు ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలో ప్రధానిని.. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు సాయం చేయాలని కోరినా ... బడ్జెట్​ ప్రవేశపెట్టేటప్పుడు .. తెలంగాణపై రాజకీయ కక్ష ధోరణిని కేంద్రం కొనసాగించిందన్నారు.  విద్యా పరంగా కాని.. ఎయిర్​ పోర్టుల విషయంలో కాని.. చాలా కాలంగా పెండింగ్​ లో ఉన్న ప్రాజెక్ట్​లకు నిధులను ఎందుకు కేటాయించలేదని మంత్రి శ్రీధర్​ బాబు ప్రశ్నించారు.

ALSO READ | కిషన్​ రెడ్డి.. బండి సంజయ్​ మంత్రి పదవులకు రాజీనామా చేయండి : టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్

తెలంగాణలో మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని... ట్రాఫిక్​ సంబంధించి అనేక సమస్యలున్నాయని.. అండర్​ గ్రౌండ్​ డ్రైనేజ్​ ను నిర్మించేందుకు కేంద్రం సహకారం కావాలని కోరినా పట్టించుకోలేదన్నారు.  విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు  ట్రిపుల్ ఐటీ,ఐఐటి, సైనిక్ కళాశాలలను తెలంగాణలో ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం పునరాలోచించాలని మంత్రి శ్రీధర్​ బాబు కోరారు.