ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిశ్రమలకు తెలంగాణ అత్యంత అనుకూలమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నెదర్లాండ్స్ కు చెందిన ఆరిక్ట్ (ARIQT) సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరిక్ట్ నూతన ఫెసిలిటీ వల్ల 300 మందికి కొత్తగా ఉద్యోగాలు దొరుకుతాయన్నారు.
గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఐటీ రంగం సాధించిన విప్లవాత్మక వృద్ధి వల్ల రాష్ట్ర జిడిపి, తలసరి ఆదాయం జాతీయ సరాసరిని మించిపోయిందన్నారు శ్రీధర్ బాబు. ఐటీ వార్షిక ఎగుమతులు 30 బిలియన్ డాలర్లకు చేరకున్నాయని చెప్పారు శ్రీధర్ బాబు. రాష్ట్రంలో 6,000 అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయని... చిన్న, మధ్య తరహా సాఫ్ట్ వేర్ సంస్థలు 1500 దాకా ఉన్నాయి. ప్రఖ్యాత సంస్థలు గ్లోబల్ సామర్థ కేంద్రాలు(జిసిసి) నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాన్నారు.
ALSO READ | ఆదివాసీల కోసం స్టడీ సర్కిల్.. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్
హైదరాబాద్ అంటే టాలెంట్ సిటీ.. టెక్ సిటీ.. ఇన్నోవేషన్ సిటీ.. స్టార్టప్స్ కు కేరాఫ్ అడ్రస్.. ఒక్క సాఫ్ట్ వేర్ రంగంలోనే కాదు ఫార్మా, బయోటెక్ తదితర రంగాల్లోనూ అనేక పరిశ్రమలున్నాయన్నారు శ్రీధర్ బాబు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు.