అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. కోరం లేకపోయినా సభ నిర్వహణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభ్యంతరం తెలిపారు. సభలో కోరం ఉండేలా చూడాలన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ కోరం పూర్తి స్థాయిలో ఉందని కౌంటర్ ఇచ్చారు. 10 శాతం సభ్యులు సభలో ఉన్నారని చెప్పారు. కోరం అంటే 12 మంది ఉంటే చాలన్నారు. సభకు బీఆర్ఎస్ నాయకులు సహకరించడం లేదని శ్రీధర్ బాబు మండిపడ్డారు. కోరం ఉందని తెలిసి కూడా బుల్డోజ్ చేస్తున్నారని ఫైరయ్యారు.
బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే సీఎం సభలో లేరన్నారు కడియం. ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంటో ఇక్కడ కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి అసెంబ్లీ చర్చపై సీరియస్ నెస్ లేదన్నారు. సీఎం, ఆర్థిక మంత్రి అనివార్య కారణాల వల్ల సభకు హాజరు కాలేదని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు . ఆర్థిక మంత్రి తర్వాత స్టేట్ మెంట్ ఇస్తారని తెలిపారు. కేసీఆర్ ను విమర్శించడం తప్ప బడ్జెట్ లో ఏమీ లేదన్నారు. కాగా . సాగునీటిపై ఇవాళ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది