జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్రంలోని పేద పిల్లలకు మెరుగైన విద్య అందించబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2024, డిసెంబర్ 14న మంత్రి శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు.. గత ప్రభుత్వం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరాకు సాగు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులు మేం ఏడాదిలోనే చేశామని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో పారిశ్రామిక పార్క్‌కు శంకుస్థాపన చేశామన్నారు. భూపాలపల్లిలో 4 లైన్స్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
ALSO READ | త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి