పథకాలు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

పథకాలు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని.. ప్రస్తుతం అందుతున్న పథకాలు అన్ని కొనసాగుతాయని.. ఈ సర్వే చేసిన తర్వాత కొన్ని స్కీమ్‎లు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దని ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. రంగారెడ్ది జిల్లా శంకర్పల్లిలో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థిక, సామాజిక, విద్యా, కులానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడమేనని పేర్కొన్నారు. ఈనెల (నవంబర్) 30వ తేదీ వరకు సర్వే కొనసాగుతోందని తెలిపారు.

ALSO READ : GHMC ఆఫీస్‎లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు

 సర్వే చేసిన ఎన్యుమరేటర్ పూర్తి సమాచారాన్ని మీ ఇంటి గోడకు అతికిస్తారని.. అందులో ఏమైనా తప్పులు ఉంటే దగ్గరలోని ఎమ్మార్వోకు కాని, ఆర్డీవోకు కాని, లేదా కలెక్టర్‏కు కాని సరైన సమాచారమిచ్చి తప్పులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు అధికారులకు సమగ్ర సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమాచారం ప్రభుత్వానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. 150 ఇండ్లకు ఒక ఎన్ముమరేటర్‎ను నియమించామని.. వారు ప్రతి ఇంటి సమాచారాన్ని సేకరిస్తారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ  సహకరించాలని విజ్ఞప్తి చేశారు.