టీ ఫైబర్ ఇంటర్ నెట్‎ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‎గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందు కోసం మిత్ర టీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం (డిసెంబర్ 8) హైదరాబాద్‎లోని పార్క్ హయత్ హోటల్‎లో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ గెస్ట్‎గా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్ నెట్ అందించే పథకాన్ని ప్రారంభించారు. 

ఈ టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రాంతీయ ఆఫీసులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. టీ ఫైబర్‎తో టీవీ, టెలివిజన్, కంప్యూటర్ సేవలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. చిన్న పరిశ్రమల కోసం కొత్త ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ తీసుకొచ్చామన్నారు. టీ ఫైబర్ ఇంటర్ నెట్ ద్వారా సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్ నగర్, జిల్లాల రైతులతో ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.