
హైదరాబాద్, వెలుగు: స్టార్టప్‌లకు సాయం చేయడానికి రామ్ఇన్ఫో రూపొందించిన "ఐకొలాబ్ హబ్ ఫౌండేషన్"ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇది ప్రభుత్వానికి, వ్యాపార సంస్థలకు ఆదాయాన్ని పెంచే ఒక కార్యక్రమం అని రామ్ ఇన్ఫో తెలిపింది.
ప్రభుత్వ టెండర్లలో స్టార్టప్‌లు పాల్గొనడానికి సహాయపడుతుంది. ప్రభుత్వానికి అవసరమైన కొత్త పరిష్కారాలను, ప్రజలకు ఉపయోగపడే కొత్త సేవలను అందించే స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. స్టార్టప్‌లు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తుంది.