Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు

 టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామని తెలిపారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.  తెలంగాణ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలీవరీ సంస్థ రూపొందించిన మీ టికెట్ యాప్ ను లాంఛ్ చేశారు మంత్రి. 

ALSO READ | సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు

అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించామని చెప్పారు శ్రీధర్ బాబు. ఆర్టీసీ, మెట్రో , తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, పార్కులు, జూ, మ్యూజియం, ఇతర పర్యాటక స్థలాల విజిట్ కు సంబంధించి ఈ యాప్ లో టికెట్ కొనొచ్చని తెలిపారు. రానురాను ఇలాంటి యాప్ లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు శ్రీధర్ బాబు.