రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన : మంత్రి శ్రీధర్​బాబు

రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన : మంత్రి శ్రీధర్​బాబు

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట, మన్సూరాబాద్, వనస్థలిపురం, లింగోజిగూడ, హస్తినాపురం డివిజన్ల పరిధిలో రూ.110 కోట్ల42లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్​బాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మధుయాష్కీ గౌడ్ నాయకత్వంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్నారు. 

ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తో కలిసి కాలనీల్లో పర్యటించారు. మంత్రి పర్యటనలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే కొత్తపేట సప్తగిరి కాలనీ వద్దకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో చేరుకోగా.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ కార్పొరేటర్లు నాయకోటి పవన్, రంగ నర్సింహ గుప్తా, ప్రేమ్ మహేశ్వర రెడ్డి, పార్టీ శ్రేణులతో అక్కడికి చేరుకున్నారు. మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కలగజేసుకుని వెనక్కి తోసేయడంతో సద్దుమణిగింది.