హైదరాబాద్: కాళేశ్వరంపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని హైకోర్టుకు మళ్లీ లేఖ రాస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అసెంబ్లీ ఆవరణలో చిట్ చాట్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సిట్టింగ్ జడ్జిని కాళేశ్వరం విచారణకు ఇవ్వాలని హైకోర్టును కోరినం. జడ్జిలు తక్కువ ఉన్నారని న్యాయస్థానం నుంచి రిప్లై వచ్చింది. మళ్లీ లేక రాస్తం. మా మ్యానిఫెస్టోలో జ్యుడీషియల్ విచారణ అని స్పష్టం చేసినం. సీబీఐ విచారణ కేంద్రం చేస్తా అంటే మేం వద్దనం.
సీబీఐ ఒకటే కాదు వాళ్లు చేయాలనుకుంటే ఈడీ, సీవీసీ ఉంది. వాటితో విచారణ చేస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒకటవువతారన్న అనుమానం మాకు ఉంది. కాగ్ నివేదిక మీద కూడా విచారణ జరిపిస్తం. సిట్టింగ్ జడ్జిని ఎప్పుడు ఇవ్వలేదన్న వాదనలు అవాస్తవం. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే కాళేశ్వరంపై ఎంక్వైరీ జరిపించేటోళ్లు. విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇచ్చేవాళ్లు’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.