వెలుగు, నాగోల్: క్రెడాయ్ ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో చాలా మంచిదని, మా ప్రభుత్వం క్రెడాయ్‌కి పూర్తిగా సహకరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నాగోల్‌లో క్రెడాయ్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను శుక్రవారం శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సామాన్యులకు ఎలాంటి ధరలకు ఇళ్లు ఇవ్వాలనేది ఈ ప్రాపర్టీ షోలో క్రెడాయ్ వివరిస్తోందన్నారు. స్కిల్ యూనివర్సిటీ లో క్రేడాయ్ సభ్యులు కూడా శిక్షణ ఇవ్వడం ఆనేది చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు.
గత నెలలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తే .. రాష్ట్రంలో 270కోట్ల రూపాయల అమ్మకం జరిగిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో అన్ని రకాల వసతులున్నాయని.. డెవలపర్స్ ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లాగా మేం మాట మార్చమని.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు శ్రీధర్ బాబు.
ALSO READ | పరిశ్రమలకు సహకారం అందిస్తాం
రాబోయే కాలంలో ఈస్ట్‌లో ఉన్న వినియోగదారులకు వారి ఆర్థిక శక్తిని దృష్టిలో ఉంచుకుని బిల్డర్స్ ముందుకు వెళ్ళాలని సూచించారు. పాలసీ నిర్ణయాలు కూడా ఈస్ట్‌లో పెట్టడానికి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. ఈస్ట్ హైదరాబాద్ వైపు 5 స్టార్ హోటల్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈస్ట్ హైదరాబాద్ వైపు మంచి ఐటీ పార్క్ ఏర్పాటుపై కూడా త్వరలోనే డెసిషన్ తీసకుంటామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫోర్త్ సిటీలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈస్ట్ వైపు ఏ కంపెనీ వచ్చిన ఇక్కడే నిర్మిస్తామని, ఐటీ హబ్‌లు కూడా ఈస్ట్ హైదరాబాద్ వైపు వచ్చేలా చూస్తామని స్పష్టం చేశారు. మెట్రో రైలును ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తామని, కాలుష్యం లేని పరిస్త్రమలు తీసుకోస్తాన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తామన్నారు.