![హైదరాబాద్ అంటే ఐటీ హబ్ మాత్రమే కాదు.. టెక్నాలజీ రివల్యూషన్‌కి అడ్డా: మంత్రి శ్రీధర్ బాబు](https://static.v6velugu.com/uploads/2025/02/minister-sridhar-babu-participated-in-the-32nd-asia-summit-programme_tANsZBnKv8.jpg)
హైదరాబాద్ అంటే ఐటీ హబ్ మాత్రమే కాదని.. టెక్నాలజీ రివల్యూషన్‌కి అడ్డా అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం (ఫిబ్రవరి 11) హైదరాబాద్ కొండాపూర్‌లోని హెచ్ఐసీసీలో 32వ ఆసియా సమ్మిట్ & అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రతిఒక్కరి లైఫ్‌లో భాగం అయిపోయిందని.. ఎన్నో ఇన్నోవేషన్స్‌కి ఏఐ ప్రతీక అని అన్నారు.
ఏఐపై పనిచేసేందుకు తెలంగాణలో 30 మంది రెడీగా ఉన్నారని తెలిపారు. ఏఐ కోసం ప్రత్యేకంగా అధికారులని కూడా నియమించామని.. హైదరాబాద్‌లో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. హైదరాబాద్‌ని డేటా సైన్స్ హబ్‌గాను మారుస్తామన్నారు. డేటా సైన్స్‌లో 70 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆయా సంస్థలు రెడీగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి టు టైర్ సిటీస్‌ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.