సింగరేణిలో ఎక్కడైనా కరప్షన్ మాట వినిపిస్తే సహించేది లేదన్నారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఉద్యోగాల పేరిట కార్మికులను దోచుకున్నారని ఫైరయ్యారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే గడ్డం వంశీని ఎంపీగా గెలిపించాలన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు.
పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గతంలో పదేండ్లు పాలించిన బీఆర్ఎస్..కార్మికులకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే..కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వంశీకృష్ణని గెలిపిస్తే బొగ్గు గనుల కోసం పోరాటం చేస్తాడన్నారు INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసిపి-2 లో సింగరేణి కార్మికులతో జరిగిన గేట్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, జనక్ ప్రసాద్ , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.