- ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: వచ్చే పదేండ్లలో రాష్ట్రాన్ని రూ.84 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే సర్కారు లక్ష్యమని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఏఐలో పెద్ద సంస్థ అయిన ‘ఫెనామ్’ శుక్రవారం హైటెక్‌సిటీలో నిర్వహించిన ‘ఐయామ్ ఫెనామ్ ఇండియా’ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. యంగ్‌ఇండియా స్కిల్స్యూనివర్సిటీ ద్వారా భవిష్యత్అవసరాలకు సరిపడా నిపుణులైన యువతను అందిస్తామని తెలిపారు.
ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడం ద్వారా యువతలోని పూర్తి సామర్థ్యాలను వెలికితీసేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఫెనామ్లాంటి యూనికార్న్‌లు పనిచేయాలన్నారు. ఏఐ, ఆటోమేషన్వాడకం ద్వారా విప్లవాత్మక మార్పులు సృష్టించడంలో ఉన్న అవకాశాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో 500 మందికి పైగా హెచ్ ఆర్ నిపుణులు, చీఫ్ ఎక్స్ పీరియన్స్ అధికారులు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ మెడల్ విన్నర్ అభినవ్ బింద్రా, ఫెనామ్ అధ్యక్షుడు, సహ వ్యవస్థాపకుడు హరి బైరెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయి కృష్ణ, ఐటీ స్ట్రాటజిస్ట్ శ్రీకాంత్ లంకా తదితరులు పాల్గొన్నారు.