ప్రజల సంక్షేమమే ఎజెండాగా పాలన : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

ప్రజల సంక్షేమమే ఎజెండాగా పాలన :  మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు
  • అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నివాళులర్పించిన మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు 

మంథని, వెలుగు: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా పాలన సాగిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు. సోమవారం మంథనిలోని పలు గ్రామాలకు నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఎక్లాస్ పూర్ నుంచి ఖమ్మంపల్లి రోడ్డు పునరుద్ధరణ పనులకు రూ.11.90కోట్లతో, ఖమ్మంపల్లి నుంచి ఓడేడు  వరకు 15 కి.మీ బీటీ రోడ్డుకు రూ.30 కోట్లు, మంథని నుంచి ఓడెడు వరకు 19 కి.మీ బీటీ రోడ్డు నిర్మాణ పనులను రూ.60 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, 15 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.  లీడర్లు దొడ్డ బాలాజీ, చొప్పరి సదానందం, దుండే రాజేందర్, కాచే పద్మ ఉన్నారు.