హైదరాబాద్ : జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్ పై సీరియస్ గా ఉన్నామని మంత్రి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలాంటి సీనియర్ వ్యక్తిని కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమన్నారు. హైకమాండ్ ఆదేశాలతో చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆయనతో మాట్లాడారని తెలిపారు.
గాంధీభవన్ లో శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ 'నేను కూడా జీవన్ రెడ్డితోమాట్లాడుతాను. ఇప్పటికే జగిత్యాల ఘటనకు సంబంధించిన వివరాలన్నీ పార్టీకి చేరాయి. జరిగిన ఘటనపై సమగ్రవిచారణ జరిపిస్తం. దాడి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టం. జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడాం. నిందితులను కఠినంగా శిక్షిప్తం. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించం. ఆయన సేవలను మేం వినియోగించుకుంటాం. చనిపోయిన బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది ' అని శ్రీధర్ బాబు తెలిపారు.
ALSO READ | బీఆర్ఎస్ నేతలు ధరణితో భూములను దర్జాగా దోచుకున్నారు: మహేశ్ కుమార్