
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళన పడొద్దు..పార్టీల ప్రలోభాలకు లోనవద్దని సూచించారు. కంచె గచ్చి బౌలి భూములపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 400 ఎకరాలు20 ఏండ్లుగా న్యాయపోరాటంలో ఉందన్నారు. వర్శిటీ విద్యార్థులు, సిబ్బందికి తాము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్నారు. హెచ్ సీయూ భూమిలో ఇంచు భూమిని కూడా ప్రభుత్వం తీసుకోలేదన్నారు.వారం రోజుల క్రితమే హెచ్ సీయూ వీసీ,సబ్ రిజిస్ట్రార్ తో తాము సంప్రదింపులు జరిపామన్నారు శ్రీధర్ బాబు.
కొంత మంది వ్యక్తులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. తప్పుడు ప్రచారాలను ప్రజలకు చేరవేస్తున్నారు. 2016 సీనియర్ ఐఏఎస్ అధికారితో కమిటీని వేశారు. గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్,బీజేపీ కుట్ర చేస్తున్నాయి. జీవ వైవిద్యానికి ఎలాంటి నష్టం కల్గించకుండా చూస్తాం. ప్రభుత్వ భూమిలో ఉన్న రాక్స్,లేక్ లను కాపాడుతాం. 2003లో ఆనాటి ప్రభుత్వం తప్పిదం చేసింది. 400 ఎకరాల ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అని శ్రీధర్ బాబు అన్నారు.
ALSO READ : HCU ఇంచు భూమి కూడా తీసుకోలేదు.. ఇందంతా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర:భట్టి విక్రమార్క