మెడికల్, లైఫ్ సైన్స్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

మెడికల్, లైఫ్ సైన్స్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ : మెడికల్ అండ్ లైఫ్ సైన్స్, ఆర్ అండ్ డీ కి హైదరాబాద్ హబ్ గా మారిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ నానాక్ రామ్ గూడా లో  మెడిట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ ఐటీ సెంటర్ ను  మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా   మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ  రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడానికి రాబోయే కాలంలో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్స్ పరిశ్రమలను ప్రోత్సహకాన్ని అందించేందుకు  విధాన పరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  మెడ్ ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ సెంటర్ లాంటి మల్టీ నేషనల్ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ర్టంలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనం గా ఈ గ్లోబల్ సెంటర్ నిలిచిందని చెప్పారు. 

ఈ సంస్థ ద్వారా 60 మిలియన్ డాలర్ల పెట్టుబడితో, 300 ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని తెలిపారు. ఫిబ్రవరిలో మొదలు పెట్టి, ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టబోతోందని వెల్లడించారు. హైదరాబాద్ లో 12 నెలలు అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఇనిషియేటివ్​తో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని తెలిపారు.  పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే కంపెనీలకు తమ ప్రభుత్వ అన్ని విధాలా ప్రోత్సహం అందిస్తుందన్నారు.  హైద్రాబాద్ లో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

ALSO READ | అటాక్స్.. రివార్డ్స్!