బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతయ్‌‌‌‌‌‌‌‌: శ్రీధర్ బాబు

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతయ్‌‌‌‌‌‌‌‌: శ్రీధర్ బాబు
  • 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తది: మంత్రి శ్రీధర్ బాబు
  •     ఎన్నికల తర్వాతరాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తామని వెల్లడి
  •     సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ కృషి చేస్తోందని వ్యాఖ్య
  •     పెద్దపల్లి, గోదావరిఖని కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్స్​లో పాల్గొన్నవివేక్‌‌‌‌‌‌‌‌, వంశీకృష్ణ

పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు : దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను తొలగించే అవకాశం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ‌‌‌‌‌‌‌‌తో కలిసి మంత్రి పాల్గొని, మాట్లాడారు. ‘‘బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు మహిళలు, రైతులు, పేదలకు ఏం చేస్తారో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మీటింగుల్లో శ్రీరాముని జపం చేసి పోతున్నరు. మేమంతా దేవున్ని నమ్మేవాళ్లమే, భగవంతుడు గుడిలో ఉంటే భక్తి మనసులో ఉండాలని నమ్ముతాం. శ్రీరాముడిని ఒక పార్టీకి సంబంధించిన వాడిగా క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ బీజేపీ కుట్ర చేస్తుంది. ఆ పార్టీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సవరించి, రిజర్వేషన్లు తీసివేస్తుంది”అని పేర్కొన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం అందించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు తయారు చేస్తున్నదని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిశాక రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో సాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి పత్తిపాక రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తామని వెల్లడించారు. 

వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలి: విజయరమణారావు

కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో తన కాళ్లరిగేలా కష్టపడి మిమ్మల్ని గెలిపించుకుంటానని చెప్పారు. పెద్దపల్లి నుంచి 50 వేలకు పైగా మెజారిటీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినీ నిర్మాత బండ్ల గణేశ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. రాబోయే 30 ఏండ్లు వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటులో ఎంపీగా ఉంటారని పేర్కొన్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో వంశీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌: వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేనని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ స్కీంలలో వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ అని, బీజేపీ గెలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తారన్నారు. వంశీని గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు అండగా ఉంటారని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామికి పెద్దపల్లి పార్లమెంటుకు 70 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. కార్మికులకు పింఛన్, పేదలకు రేషన్ కార్డులు వచ్చేందుకు కాకా కృషి చేశారని తెలిపారు. గతంలో 75 వేల మంది ఇండ్లు లేని వాళ్లకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గుడిసెలు వేయించి వారికి పట్టాలు ఇప్పించారన్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు మారుతాయని, తొలి ఉద్యమంలో బుల్లెట్లకు కాకా ఎదురు నిలిచి పోరాడారని చెప్పారు. రామగుండంలో ఉన్న ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి రూ.10 వేల కోట్లు రుణమాఫీ చేయించిన ఘనత కూడా వివేక్ వెంకటస్వామిదేనన్నారు. మూతపడ్డ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ను తిరిగి ప్రారంభించడంలో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని తెలిపారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గాన్ని దోచుకుంటే.. బీజేపీ ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గానికి అవసరమైన పత్తిపాక రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించి తీరుతామన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో ప్రజల గొంతునవుతానని వంశీకృష్ణ స్పష్టం చేశారు.