గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది : మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర ప్రగతి, గౌరవాన్ని కాపాడే గొప్ప గొప్ప అవకాశం TGSPF చేతుల్లో ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్ 9 నెలల శిక్షణ పూర్తై పాసింగ్ ఔవుట్ పరేడ్ కార్యక్రమానికి ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరైయ్యారు. అమీన్ పూర్ లో ఈ కార్యక్రమం జరిగింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 265 మంది నవంబర్ 29న ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రానికే ఇది చాలా ముఖ్యమైన రోజని అన్నారు. ఉద్యోగంలో చేరబోతున్న వారిని ఉద్దేశించి ఈ పరేడ్ మీరు కన్న కలని సహకారం చేసుకొని రక్షకులుగా మారే అద్భుత కార్యక్రమని మంత్రి అన్నారు.

పట్టుదలతో మీరు సాధించిన ఉద్యోగం.. పూర్తి చేసుకున్న కఠోర శిక్షనే సాక్ష్యమని కానిస్టేబుల్స్ తో అన్నారు. సెక్రటేరియట్ భద్రత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో పెడుతుందని తెలిపారు. తొమ్మిది నెలల ట్రైనింగ్ లో అనేక టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్చుకున్నారని చెప్పారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే క్రమశిక్షణకు, టీం వర్క్ కు నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులు ట్రైనింగ్ లో నేర్చుకున్న విలువలే హైకోర్టు, అసెంబ్లీ, ఆసుపత్రులు, రిజర్వ్ బ్యాంక్ లాంటి కార్యాలయాల భద్రతని కాపాడుతాయన శ్రీధర్ బాబు అన్నారు. విధినిర్వహణలో చేరబోతున్న పోలీసులకు మంత్రి శుభాకాంశలు తెలిపారు.