ఫార్ములా ఈ కార్ రేస్ను మేం తప్పుబట్టలె:మంత్రి శ్రీధర్ బాబు

ఫార్ములా ఈ కార్ రేస్ను మేం తప్పుబట్టలె:మంత్రి శ్రీధర్ బాబు
  • జగదీశ్​ రెడ్డి హావభావాలు బాగలెవ్
  • సెషన్స్ చివరి నాటి ఎథిక్స్ కమిటీ ఏర్పాటు
  • మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్

ఫార్ములా ఈ కార్ రేస్ ను తాము ఎప్పుడు తప్పు పట్టలేదని మంత్రి డి.శ్రీధర్​ బాబు అన్నారు. అయితే ఈ కార్ రేస్ విషయంలో చెల్లింపులు జరిగిన విధానం సరిగా లేదని అన్నట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్​ చాట్​ నిర్వహించారు. 'మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతుంది. అది అంతర్జాతీయ ప్రోగ్రాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరు కంటే ఆయన హావభావాలు సరిగా లేవు. అహంకారపూరితంగా ఉన్నాయి. అందుకే మా సభ్యులు మూకుమ్మడిగా వెంటనే లేచి అబ్జెక్షన్ చెప్పారు. రికార్డులు పరిశీలించాం. ఈ సెషన్స్ చివరి నాటికి ఎథిక్స్ కమిటీ తప్పకుండా ఏర్పాటు చేస్తాం. సభ్యుడి ఎక్స్ పెల్ అనేది స్పీకర్ నిర్ణయం' అన్నారు.