
పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలుచేస్తున్నామని, పార్లమెంట్ ఎన్నికలయ్యాక పూర్తిస్థాయిలో అమలుచేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంథని మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు 150 మంది కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను చూసి ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు.