పదేండ్లలో మీరు చేసిన అవినీతిని బయటకు తీస్తున్నం: శ్రీధర్ బాబు

పదేండ్లలో  మీరు చేసిన అవినీతిని బయటకు తీస్తున్నం: శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ గ్రాప్ ఎక్కడా పడిపోలేదు...ఐదేండ్లు తమ ప్రభుత్వానికి ఢోకాలేదన్నారు. పది‌ సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన  అవినీతిని పకడ్బందీగా బయటికి తీస్తున్నామని చెప్పారు. 

వామన్ రావు దంపతుల హత్యకేసు‌ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్నారు.హత్య రాజకీయాలను క్షమించేది లేదని.. భూపాలపల్లి హత్య విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. ఖచ్చితంగా తప్పు చేసినవారికి శిక్ష ‌పడుతుందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్తిని నిలబెట్టకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజేపీకి సపోర్ట్ చేస్తుందన్నారు శ్రీధర్ బాబు.  కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.. తాము బీఆర్ఎస్ తో ఎలా నడుస్తామన్నారు.  బీజేపి, బీఆర్ఎస్ లు కలిసి నడుస్తున్నాయని చెప్పారు. పట్టభద్రుల  ఎన్నికలలో  ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నారు..

నరేందర్ రెడ్డిపై బీజేపీ నాయకులు‌ దుష్ప్రాచారం చేస్తున్నారని చెప్పారు శ్రీధర్ బాబు. నరేందర్ రెడ్డి ఎన్నిక కాదు ఇది....కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అని అన్నారు.  317 జీవో బీఆర్ఎస్ తీసుకొస్తే  బీజేపి మద్దతు తెలిపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 317 జీవో ద్వారా అన్యాయం జరిగిన వారికి వెసులుబాటు కల్పించామన్నారు.  317 జీవో గురించి మాట్లాడే హక్కు బండి సంజయ్ కి లేదన్నారు శ్రీధర్ బాబు.