రైతులు, ఆఫీసర్లు, యాజమాన్యంతో చర్చించాం: శ్రీధర్ బాబు

  • ఫ్యాక్టరీకి వందాలాది కోట్లు బకాయిలు
  • మినిస్టర్  శ్రీధర్ బాబు 

జగిత్యాల : అరునూరైనా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పున: ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు  స్పష్టం చేశారు.  జగిత్యాలలో నిర్వహించిన  ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.   ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచనలతోనే   కాంగ్రెస్  మ్యానిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పున:రుద్దరణ  ప్రధాన అంశంగా పెట్టామన్నారు.  ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఫ్యాక్టరీ పున:రుద్ధరణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రైతుల పట్ల తమ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నామన్నారు. చెరుకు రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల కోసం రైతులు, ఆఫీసర్లు, ఫ్యాక్టరీ యాజమాన్యం తో చర్చించామన్నారు. 

ALSO READ :- మామీద కక్షతో రైతులకు నష్టం చేయొద్దు :మాజీ మంత్రి హరీష్రావు

 బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే  ఫ్యాక్టరీ మూత పడిందని, ఫ్యాక్టరీ పున: రుద్దరణ కోసం ఆలోచన చేయలేదన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఎన్ని సార్లు సర్కార్ దృష్టికి తీసుకువెళ్లినా కేసీఆర్ సర్కార్  స్పందించలేదన్నారు.  రీ పేమెంట్ ఇచ్చే క్రమంలో వందాలాది కోట్లు ఫ్యాక్టరీకి బకాయిలు ఉన్నాయన్నారు. ఏ విధంగా నైనా చెల్లింపులు చేసి ఫ్యాక్టరీని పున:రుద్దరించాలని పూర్తి నిబద్దత తో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.