అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్..శ్రీధర్ బాబు కౌంటర్

అసెంబ్లీ నుంచి  బీఆర్ఎస్ వాకౌట్..శ్రీధర్ బాబు కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ అయ్యింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నామన్న కేటీఆర్... బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.  అయితే బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. రీజన్ లేకుండా వాకౌట్ చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని బీఆర్ఎస్ వాకౌట్ చేసిందన్నారు. 

 ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఎస్సీ వర్గీకరణపై తాము స్పష్టంగా ఉన్నామని చెప్పారు.  ఎస్సీ వర్గీకరణపై పోరాడిన వాళ్లను అభినందిద్దామని చెప్పారు.  వర్గీకరణపై కాంగ్రెస్ పోరాడినట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వర్గీకరణ అంశంలో నిజాయితీని బీఆర్ఎస్ గుర్తించిందన్నారు. ఎస్సీ,ఎస్టీలకు 12 లక్షలు ఇస్తామన్నారు ఏమైందని ప్రశ్నించారు. 

Also Read : మూడు గ్రూపులుగా ఎస్సీలు..ఎవరికి ఎంత రిజర్వేషన్ అంటే.?

రాబోయే బడ్జెట్ లో అంబేద్కర్ అభయహస్తానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు 18 శాతం,ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యానని ప్రశ్నించారు.చేవేళ్ల సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ఎప్పటి నుంచి అమలుచేస్తారని ప్రశ్నించారు. బీసీల వైఖరిపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని అన్నారు కేటీఆర్.